Chittoor : పోలీస్ డాగ్ కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

గత కొంతకాలంగా స్నిఫర్ డాగ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. 9 సంవత్సరాలకు పైగా జిల్లా డాగ్ స్క్వాడ్ గా సేవలందించింది.

sniffer dog dies final rites

Chittoor Police Dog : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో పోలీస్ డాగ్ కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో మరణించిన స్నిఫర్ డాగ్ “జెస్సీ”కి గన్ సెల్యూట్, పోలీస్ బ్యాండ్ సహా పూర్తి పోలీసు గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్నిఫర్ డాగ్ 9 సంవత్సరాలకు పైగా జిల్లా డాగ్ స్క్వాడ్ గా సేవలందించింది.

గత కొంతకాలంగా స్నిఫర్ డాగ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న డాగ్ ఆదివారం మరణించింది. పోలీసు డిపార్ట్ మెంట్ కు డాగ్ చేసిన సేవలను జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఏఆర్ ఏస్పీ నాగేశ్వర రావు మరియు ఇతర పోలీసు అధికారులు గుర్తు చేసుకున్నారు.