Cm Chandrababu Angry: మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్.. జాగ్రత్త అంటూ వార్నింగ్.. లేదంటే..

కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనా మంత్రులతో డిస్కస్ చేశారు చంద్రబాబు.

Cm Chandrababu Angry: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫైల్స్ క్లియరెన్స్ లో అలసత్వం చూపుతున్నారు అంటూ ఆక్షేపించారు. ఒక్కో ఫైల్ క ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన సీఎం.. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు.

క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సమావేశమైన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనా మంత్రులతో డిస్కస్ చేశారు చంద్రబాబు.

కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందన్నారు.

అందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అలా కాదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. వరుస వివాదాల క్రమంలో దగ్గుబాటిని పిలిచి సీఎం చంద్రబాబు మాట్లాడారు.

ఎమ్మెల్యేకి సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని దగ్గుపాటికి సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Also Read: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై లోకేశ్ సీరియస్.. పార్టీ, ప్రభుత్వానికి నష్టం అంటూ ఫైర్