అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు.. ఇప్పుడు బోట్లతో విధ్వంసానికి వ్యూహం పన్నారు: సీఎం చంద్రబాబు

ఎవరైనా బోట్లను జాగ్రత్తగా ఉంచుకుంటారు. కృష్ణా ప్రవాహం ఉదృతంగా ఉన్న సమయంలో పడవలు వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి..?

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఎరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం రోడ్డుమార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఏలూరులో రైతులు, వరద బాధితులతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారు. తొమ్మిదేళ్లలో రౌడీలు అనేవారు లేకుండా చేశాం. ఇప్పుడు నాకు పెను సవాలుగా మారింది. రాజకీయ పార్టీపై దాడిచేసిన వారిని అరెస్టు చేస్తే ధర్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలపై, వ్యక్తులపై గతంలో ఎప్పుడూ దాడులు లేవు. ఒక నేరస్తుడితో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాను. ప్రజాహితం కోసం ఈ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

వరదల్లో ప్రజలు శభాష్ అనేలా అధికారులు పనిచేశారు. నేను ముంపు ప్రాంతాల్లో వరద నీటిలో తిరుగుతున్నానని తెలిసి హెలికాప్టర్లలో తిరిగే వాడు ఒకరోజు వచ్చి బురదలోకి దిగాడు.. మళ్లీ కనిపించలేదని జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు కామెంట్స్ చేశారు. ఖజానా ఖాళీ.. అభివృద్ధి లేదు. అప్పుల వాళ్లు తిరుగుతున్నారు. ప్రజలు గత ఎన్నికల్లో మంచి పనిచేశారు.. కూటమి అభ్యర్థులను గెలిపించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. మనం ఎన్డీయేలో భాగస్వామ్యం కాబట్టి కేంద్రం కూడా సహాయం అందిస్తోంది. మేము ఇచ్చిన హామీ ప్రకారం మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వరద నష్టాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే సేకరించాం. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం . ప్రతీ వ్యక్తికి న్యాయం చేస్తాం. ఈనెల 17లోగా వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని, రైతులకు వరికి ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇస్తామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు కౌలు రైతులకు ఏది అందేది కాదు. ఇక నుంచి కౌలు రైతులకే పరిహారం అందేలా చర్యలుతీసుకుంటామని చంద్రబాబు అన్నారు.

Also Read : బీజేపీ ఉన్నంతకాలం అలా జరగనివ్వం.. రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.. డయాఫ్రం వాల్ గోదావరిలో కలిపేశారు. తొందర్లోనే మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పనులు పట్టాలెక్కిస్తామని చంద్రబాబు అన్నారు. సాగునీటి సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఏలూరు శనివారపుపేటకు వంతెన మంజూరుకు హామీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కృష్ణా నదికి ఎన్నడూ ఊహించని విధంగా వరద వచ్చింది. గత ప్రభుత్వం తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం అయింది. ప్రకాశం బ్యారేజీకి 70ఏళ్ళు పైబడ్డాయి. బ్యారేజీకిపైన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్టులు ఉన్నా బ్యారేజీకి పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి. గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. టీడీపీ హయంలో మంజూరు చేసిన నిధులను కూడా పక్కన పెట్టారు. వైకాపా హయాంలో తప్పుడు పత్రాలతో అక్రమ కట్టడాలు నిర్మించారు. ఎక్కడా ఒక డ్రెయిన్, కాలువ తవ్విన పాపాన పోలేదు. వాళ్ల పాపాలు మనకు సావాలుగా మారాయని చంద్రబాబు అన్నారు. బుడమేరు గండ్లు పూడ్చడానికి ఒక యుద్ధమే చేశాం. ఆర్మీ వాళ్ళే మా వల్ల కాదని చేతులెత్తేశారు. మా మంత్రులు దగ్గరుండి బుడమేరు గండ్లు పూడ్పించారని చంద్రబాబు అన్నారు.

Also Read : YS Jagan : చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు‌.. అందుకే ఆ అరెస్టులు

ఎవరైనా బోట్లను జాగ్రత్తగా ఉంచుకుంటారు. కృష్ణా ప్రవాహం ఉదృతంగా ఉన్న సమయంలో పడవలు వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి..? అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు.. ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని వ్యూహం పన్నారు. నేరాలు చేసే వారు ప్రజా జీవితంలోఉంటే ఇలానే ఉంటుందని వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు