బీజేపీ ఉన్నంతకాలం అలా జరగనివ్వం.. రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

రాహుల్ గాంధీకి ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను.. బీజేపీ ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు.

బీజేపీ ఉన్నంతకాలం అలా జరగనివ్వం.. రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

Amit Shah

Updated On : September 11, 2024 / 1:24 PM IST

Amit Shah : అమెరికా పర్యటనలోఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ దేశంలో రిజర్వేషన్ల విషయంతో పాటు పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో భారత దేశాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు.. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విఛ్చిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్, కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Rahul Gandhi : రిజర్వేషన్ల రద్దు అంశం.. ఎన్నికల సంఘంపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీకి ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను.. బీజేపీ ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అదేవిధంగా దేశ భద్రతతో ఆటలాడలేరని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ ప్రతీసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్ షా అన్నారు. ప్రాంతీయ వాదం, మతం, భాష పరంగా చీలకలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ ప్రకటన బయటపెట్టిందని అమిత్ షా అన్నారు.