ఆ విషయంలో మేము కూడా ఆందోళనలో ఉన్నాం- ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేము అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Cm Chandrababu Naidu (Photo Credit : Google)

Cm Chandrababu Naidu : పొలిటికల్ గవర్నన్స్ అంటే అన్నింటిలోనూ తల దూర్చటం కాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మద్యం టెండర్లలో పోటీ ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆదాయం కోసం పోటీ పెంచుతారా అని కొందరు విమర్శించే వాళ్లూ ఉన్నారని ధ్వజమెత్తారు. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలని చంద్రబాబు చెప్పారు. ఇసుక విషయంలో మేము కూడా ఆందోళనలో ఉన్నామన్నారాయన. వర్షాలు, వరదల వల్ల డిమాండ్ కు తగ్గ లభ్యత లేదని చెప్పారు. ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేము అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్..
మద్యం టెండర్లలో జోక్యం చేసుకునే ప్రజాప్రతినిధులను సహించను. మద్యం టెండర్లు పారదర్శకంగా జరగాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటి చర్యలు ఉపేక్షించను. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రజలకు మంచి పేరు తీసుకురావటమే పొలిటికల్ గవర్నెన్స్ అని ఎమ్మెల్యేలు తెలుసుకోవాలి. ఇసుక లభ్యత తక్కువగా ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తవ్వకం, రవాణా కలిపి ఎవరి జోక్యం లేకుండా వీలైనంత తక్కువ ధరకు ఇసుక ఇచ్చేలా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం నిర్వహించే ఇసుక విధానం నిబంధనలకు లోబడే చేయాలి.

Also Read : ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. మా వాళ్లు కూడా ఆ బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు..