Cm Chandrababu : నాలా చట్టం రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. నాలా వల్ల లేఅవుట్ లు ఆలస్యమై అవినీతికి కేరాఫ్ గా మారిందని ఆయన అన్నారు. రెండు రోజుల ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. 22 గంటల పాటు కలెక్టర్ల సదస్సు జరిగింది. మళ్ళీ జిల్లా పర్యటనల్లో కలుద్దాం అంటూ సదస్సు ను సైన్ ఆఫ్ చేశారు సీఎం చంద్రబాబు.
”సమస్యలు పరిష్కరించడానికే మనం ఉన్నాం. జిల్లా స్థాయిలోనే పరిష్కారాలు లభించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే CMO చేస్తుంది. అంతిమంగా ఏ సమస్య అయినా పరిష్కారం కావాల్సిందే. నాలుగు సార్లు సీఎం అయినా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం. సూపర్ 6 కోసం కొంత అప్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
Also Read : ఏపీలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసు ఇంత సంచలనంగా ఎందుకు మారింది? అసలేం జరుగుతోంది?
పాత అప్పులను స్వాప్ చేస్తున్నాం. దాంతో 2,3 వేల కోట్ల ఆదాయం కలుగుతుంది. నేను పరిగెత్తడమే కాకుండా మిమ్మల్ని అందరినీ పరిగెత్తించాలని అనుకుంటున్నా. గతంలో నేను పరిగెత్తుతుంటే కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు, మరి కొంత మంది అయ్యే వాళ్ళు కాదు. కూటమి ప్రజాప్రతినిధులకు అధికారులు గౌరవం ఇవ్వాలి. అలా అని తప్పుడు పనులకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కడా వేధింపులు ఉండరాదు. ఆక్వా రైతులకు యూనిట్ 1.50 పైసలకే విద్యుత్ ఇస్తున్నాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.