Cm Chandrababu: ఎన్నో సమస్యలున్నా ప్రతి హామీని అమలు చేస్తున్నాం, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తేవటమే లక్ష్యం- సీఎం చంద్రబాబు

లబ్ది పొందిన వారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రభుత్వానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. (Cm Chandrababu)

Cm Chandrababu: మీ ఆనందం కోసమే మేము అహర్నిశలు పని చేస్తున్నాం అని మహిళలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ 2047 తెస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తీసుకొచ్చామన్నారు. మహిళల ముఖాల్లో ఆనందం చూడటం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు చంద్రబాబు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తేవటం, వారి గౌరవం మరింత పెంచే విధంగా ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ మహిళలకు కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇపుడు సగర్వంగా చెబుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

”కూటమి పొత్తు గురించి బేషరతుగా చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. మహిళలు అసలు నవ్వారా? ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా? రోడ్డు మీదకు వస్తే జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. కానీ మన ప్రభుత్వంలో మాత్రం మహిళల జోలికి వచ్చే సాహసం ఎవరూ చేయరు. (Cm Chandrababu)

స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టాం. మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. మహిళా సాధికారిత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలి. ఉచిత బస్సు పథకంతో 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు. మహిళలకు యూనివర్సిటీని ప్రారంభించింది ఎన్టీఆర్.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు:

64 లక్షల మందికి NTR భరోసా ఇచ్చాము. గతంలో పెన్షన్ ను 2 నుండి 3 వేలు చేయటానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన పెన్షన్ అందించా. లబ్ది పొందిన వారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రభుత్వానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు 2వేల వరకు మిగులుతుంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఎన్నో సమస్యలున్నా ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. 11,400 బస్సుల్లో 8,458 బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించాం. శ్రీకాకుళం నుండి మంత్రాలయం, శ్రీశైలం వరకు ఉచిత ప్రయాణం చేయచ్చు. ఆలయాల సందర్శన కోసం ఉచిత ప్రయాణం ఉపయోగపడుతుంది. మహిళల ఆశీస్సులు ఉన్నంత వరకు కొండలనైనా పిండి చేస్తాం. ఒక్క రూపాయి కూడా ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఓ అన్నగా నా ఆడబిడ్డలకు అందిస్తున్న కానుక.

బస్సుల కోసం రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ సిబ్బందిపై ఉంది. ఈ భారం ఆర్టీసీపై పడకుండా ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తున్నాం. కార్గో, ఆర్టీసీ స్థలాల కమర్షియల్ పై దృష్టి సారిస్తున్నాం.
ఇకపై ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తాం. ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తున్నాం.

ఆడబిడ్డలను అవమానించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు, పవన్ కల్యాణ్ కు తెలుసు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రారంభంలో కొన్ని సమస్యలు వస్తాయి. దానికి ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలి. అదే సమయంలో మహిళలు కూడా ఆర్టీసీ సిబ్బందిని గౌరవించాలి. అమరావతిని భవిష్యత్తులో ఓ సుందర నగరంగా తీర్చిదిద్దుతాం” అని సీఎం చంద్రబాబు అన్నారు. (Cm Chandrababu)

Also Read: ఓడిపోతే “ఓట్ల చోరీ” అంటున్నారు.. గెలిచినప్పుడు ఓ న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా?: పవన్ కల్యాణ్