సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే మిగిలిన వారికి అది ప్రేరణ: చంద్రబాబు

తాను తమ ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణమని తెలిపారు.

N Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని చెప్పారు. తాను కూడా తమ ఊరికి ప్రతి సంక్రాంతికి వెళ్తున్నానని తెలిపారు.

సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే మిగిలిన వారికి అది ప్రేరణ అని చెప్పారు. తాను తమ ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణమని తెలిపారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో ఇలా అందరూ తమ బంధువులను కలుసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

పేదలకు సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ విధానాన్ని ప్రోత్సహించటానికే పీ4 కాన్సెప్ట్ పేపర్ ను రేపు విడుదల చేస్తామని చెప్పారు. దీనిపై అన్నిస్తాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతికి రద్దీ ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు.

సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని అన్నారు. రద్దీని నియంత్రించటానికి కలెక్టర్లతో మాట్లాడతానని తెలిపారు. నగరాలకు చేరుకున్న వారిని వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు కాలేజీలు, స్కూళ్లు బస్సులు ఏర్పాటు సూచనను పరిశీలిస్తామని చెప్పారు. గత సంక్రాతితో పోల్చితే చాలా వరకూ రహదారులను మెరుగుపరిచామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది: మంత్రి నిమ్మల రామానాయుడు