వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది: మంత్రి నిమ్మల రామానాయుడు

గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది: మంత్రి నిమ్మల రామానాయుడు

Minister Nimmala ramanaidu

Updated On : January 11, 2025 / 3:37 PM IST

వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఆయన స్వాగతం‌ పలికారు.

ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని అన్నారు. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చెప్పారు. పోలవరాన్ని విధ్వంసం చేసి, నిర్వాసితులను నిర్లక్ష్యం చేసి, డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్ కు, వైసీపీకి ఈ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలోనే డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలుపెడతామని నిమ్మల అన్నారు. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ కు పూర్తి చేసేలా పని చేస్తున్నామని తెలిపారు.

నిర్వాసితులకు 2017లో రూ.800 కోట్ల పరిహారం అందించిన చంద్రబాబేనని, మళ్లీ ఇప్పుడు మరో రూ.800 కోట్లకు పైగా నిధులను అందించిందీ చంద్రబాబేనని నిమ్మల రామానాయుడు తెలిపారు. గత వైసీపీ పాలనలో నిర్వాసితులకు ఒక్క రూపాయు పరిహారము అందలేదని చెప్పారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణము జరగలేదని తెలిపారు.

రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయి: చంద్రబాబు