CM Chandrababu: నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ

సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం నారావారిపల్లెలో పర్యటిస్తున్న చంద్రబాబు.. గంగమ్మ, నాగాలమ్మకు పూజలు చేశారు.

CM Chandrababu unveiled the statues of NTR couple

CM Chandrababu: సంక్రాంతి పర్వదినాన్ని ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మరోవైపు నారావారి పల్లెలో సంక్రాంతి సంబురాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. మంత్రి లోకేశ్ కుమారుడు దేవాంశ్ కూడా ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశాడు. అనంతరం పోటీల్లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందజేశారు. అదేవిధంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు.

Also Read: Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం నారావారిపల్లెలో పర్యటిస్తున్న చంద్రబాబు.. గంగమ్మ, నాగాలమ్మకు పూజలు చేశారు. ఇంటి నుంచి గ్రామదేవత గంగమ్మ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వెళ్లి చంద్రబాబు పూజలు చేశారు. అనంతరం నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నారావారిపల్లెలో అమ్మణ్ణమ్మ, కర్జూర నాయుడు సమాధుల దగ్గర చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ దంపతుల విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

 

నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు పర్యటన ప్రత్యక్షప్రసారం..