Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

ఏ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో వెళ్తే సినిమాని నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

Venkatesh Meenakshi Chaudhary Aishwarya Rajesh Sankranthiki Vasthunnam Movie Review and Rating

Updated On : January 14, 2025 / 2:14 PM IST

Sankranthiki Vasthunnam Movie Review : వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నేడు జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. పార్టీ ప్రసిడెంట్(వీటివీ గణేష్) స్పెషల్ పార్టీ అని సత్య ఆకెళ్ళను ఫామ్ హౌస్ కి తీసుకెళ్లడంతో కొంతమంది దుండగులు సత్య ఆకెళ్ళని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేని విడుదల చేయమంటారు. సత్య కిడ్నాప్ బయటకు తెలిస్తే తమ రాష్ట్ర పరువు, సీఎం పదవి పోతుందని ఎవరికీ తెలియకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడటానికి మాజీ పోలీసాఫీసర్ YD రాజు(వెంకటేష్)ని తేవాలనుకుంటారు.

కానీ YD రాజు సిన్సియర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో సస్పెండ్ అయి పెళ్లి చేసుకొని రాజమండ్రిలో భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేష్), పిల్లలతో లైఫ్ గడుపుతూ ఉంటాడు. దాంతో అతన్ని తీసుకురావడానికి అతని మాజీ ప్రేయసి, సత్యకి సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్ మీనాక్షి(మీనాక్షి చౌదరి)వెళ్తుంది. మరి YD రాజు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడా? మీనాక్షితో రాజు ఎందుకు విడిపోయాడు? రాజు మాజీ ప్రేయసి వచ్చాక భార్య ఎలా మారింది? సత్య ఆకెళ్ళని రాజు కాపాడాడా? భాగ్యం – మీనాక్షి మధ్య గొడవ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Raja Saab : ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ నుంచి సంక్రాంతి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌.. ప్ర‌భాస్ ఎంత అందంగా న‌వ్వుతున్నాడో చూశారా?

సినిమా విశ్లేషణ.. అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అని తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సత్య ఆకెళ్ళ రావడం, అతన్ని కిడ్నాప్ చేయడం, YD రాజు, అతని భార్య, పిల్లలతో లైఫ్, మీనాక్షి రాజుని వెతుక్కుంటూ రావడం, ఆపరేషన్ గురించి సీఎంని కలవడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ పక్క భార్య మరో పక్క మాజీ ప్రేయసి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు చూపిస్తూనే సత్యని ఎలా కాపాడుకున్నారు అని చూపించారు.

ఫస్ట్ హాఫ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లు ఏమి లేకుండా సింపుల్ గానే సెట్ చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం క్రైమ్ కామెడీతో సాగినా కొద్దిగా సాగదీసినట్టు ఉంటుంది. సినిమా అయిపొయింది అనుకునేలోపే ఇంకా సాగదీసి చివర్లో ఓ టీచర్ మెసేజ్, భార్య, మాజీ ప్రేయసికి మెసేజ్ అంటూ కొనసాగించడంతో కథ అయిపోయినా ఇంకా ఎందుకు సాగదీస్తున్నారు అనిపిస్తుంది. కామెడీతో పాటు అంతర్లీనంగా ఓటీటీ పిల్లలపై ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అంటూ మంచి మెసేజ్ లు కూడా ఎంటర్టైనింగ్ గా చెప్పారు. రియల్ లైఫ్ లో జరిగే చాలా సన్నివేశాలు బాగా రాసుకుని, పర్ఫెక్ట్ డైలాగ్స్ తో ఎంటర్టైన్మెంట్ గా ప్రజెంట్ చేసాడు అనిల్ రావిపూడి. ఏ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో వెళ్తే సినిమాని నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.

Sankranthiki Vasthunnam

 

నటీనటుల పర్ఫార్మెన్స్.. వెంకటేష్ పోలీసాఫీసర్ ఎపిసోడ్ మొత్తం ఘర్షణ లుక్స్ గుర్తుచేస్తాయి. ఊళ్ళో పంచె కట్టుకొని భాగ్యం మొగుడి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇలాంటి పాత్రలు వెంకిమామకి వెన్నెతో పెట్టిన విద్య. భర్తని అమితంగా ప్రేమించే గోదావరి అమ్మాయి పాత్రలో ఐశ్వర్య రాజేష్ అదరగొట్టేసింది చెప్పొచ్చు. భర్త మాజీ ప్రేయసి వస్తే లేడీస్ కి వచ్చే జెలస్ చూపిస్తూ చాలా బాగా నటించింది ఐశ్వర్య. మీనాక్షి పోలీసాఫీసర్ గా యాక్షన్ చేస్తూ మాజీ ప్రేయసి పాత్రలో ఒక అమ్మాయికి ఉండే జెలస్ తో బాగానే నటించింది.

VTV గణేష్ పార్టీ ప్రసిడెంట్ గా ఫుల్ గానే నవ్వించారు. జైలర్ పాత్రలో ఉపేంద్ర లిమయే కూడా ఫుల్ గా నవ్విస్తారు. అవసరాల శ్రీనివాస్, సాయి కుమార్, మురళి గౌడ్, పమ్మి శీను.. పలువురు నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో అదరగొట్టి ఫుల్ గా నవ్వించాడు.

Also Read : Sankranthiki Vasthunam : విక్ట‌రీ వెంక‌టేష్ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ట్విట‌ర్‌ రివ్యూ

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఫుల్ రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పాటలు ముందే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు భీమ్స్ సిసిరోలియో. కామెడీతో యాక్షన్ సన్నివేశాలను కూడా బాగా డిజైన్ చేసారు. అనిల్ రావిపూడి తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నమ్ముకొని బాగానే నవ్వించాడు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా దిల్ రాజు ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భార్య, మాజీ ప్రేయసి మధ్య నలుగుతూ ఓ వ్యక్తిని కాపాడటానికి మాజీ పోలీసాఫీసర్ చేసిన ప్రయాణాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.