Raja Saab : ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ నుంచి సంక్రాంతి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌.. ప్ర‌భాస్ ఎంత అందంగా న‌వ్వుతున్నాడో చూశారా?

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిత్రం రాజాసాబ్.

Raja Saab : ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ నుంచి సంక్రాంతి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌.. ప్ర‌భాస్ ఎంత అందంగా న‌వ్వుతున్నాడో చూశారా?

Prabhas Rajasaab sankranti special poster released

Updated On : January 14, 2025 / 9:47 AM IST

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న‌ చిత్రం ‘రాజాసాబ్’. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంజయ్ దత్‌, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక సంక్రాంతి సంద‌ర్భంగా అదిరిపోయే పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం.

క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తున్న ప్ర‌భాస్ ఫోటోను పోస్ట్ చేసింది. అంద‌రికి సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఈ పిక్ వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ ఎంతో అందంగా, స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు.

Sankranthiki Vasthunam : విక్ట‌రీ వెంక‌టేష్ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ట్విట‌ర్‌ రివ్యూ

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్ర ఆడియో లాంఛ్ కార్యక్ర‌మాన్ని జ‌పాన్‌లో చేయ‌నున్న‌ట్లు త‌మ‌న్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో జ‌ప‌నీస్ వెర్ష‌న్‌లో ఓ సాంగ్ చేయాల‌ని చిత్ర బృందం త‌న‌ను కోరినట్లు చెప్పాడు.

క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ త్రినాథ నక్కిన రావు..

ఈ మూవీలో ఓ డ్యూయెట్‌, స్పెషల్‌ సాంగ్‌, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్ ఉన్నాయ‌ని అన్నాడు. ఈ చిత్రం పై ఎలాంటి అంచ‌నాలు లేకుండా వెళ్లి చూస్తే అంత ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తార‌ని అన్నాడు.