Free Bus Ride Scheme : మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలోని మరో హామీ నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు..!
ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల ఉపసంఘాన్ని కూడా నియమించారు. సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తారంటూ వార్తలు వచ్చినా.. దానిపై ఇంకా నివేదిక రాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులతో సీఎం చంద్రబాబు తాజాగా కీలక చర్చలు జరిపారు.
Also Read : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు..
ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితుల అధ్యయనం..
ఈ సమావేశంలో రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకంపై తీసుకుంటున్న చర్యల పట్ల సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తామని ముఖ్యమంత్రితో చెప్పారు అధికారులు.
కర్నాటక, తెలంగాణ, ఢిల్లీలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగాది నాటికి పథకం అమలు జరిగేలా కార్యాచరణలో వేగం పెంచాలని నిర్దేశించారు.
Also Read : పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ