Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట..

ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట..

Updated On : December 31, 2024 / 4:48 PM IST

Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినానికి స్వల్ప ఊరట లభించింది. పేర్నినాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి పోలీసుల షాక్..
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి పోలీసులు షాక్ ఇచ్చారు. పేర్ని నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏ-6గా చేర్చారు. ఈ కేసు నేపథ్యంలో పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అప్పటివరకు పేర్నినానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పేర్నినానికి స్వల్ప ఊరట లభించినట్లైంది.

Also Read : రేషన్ బియ్యం మాయం కేసులో బిగ్ ట్విస్ట్.. పేర్ని నానికి షాకిచ్చిన పోలీసులు

బియ్యం మాయం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. చివరికి పేర్నినాని మీదకు వచ్చింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పేర్నినాని గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. ఈ విచారణ అనంతరం బియ్యం మాయం కేసులో పేర్నినాని పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఆ వెంటనే పేర్నినానిపై కేసు నమోదు చేసి ఏ-6గా చేర్చారు.

Ration Rice

Ration Rice

ఆ కేసుతో పేర్నినానికి ఎలాంటి సంబంధం లేదని వాదనలు..
వెంటనే అలర్ట్ అయిన పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కోరారు. బియ్యం మాయం కేసుకు, పేర్నినానికి ఎలాంటి సంబంధం లేదని పేర్నినాని తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, మంత్రిగా ఉన్న సమయంలో పేర్నినాని సలహాలు, సూచనలతోనే రేషన్ బియ్యం మాయం అయ్యాయని పీపీ వాదించారు.

PDS Rice Case

ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు.

అటు.. రేషన్ బియ్యం మాయం కేసు విచారణలో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. పేర్నినాని గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు. వారిని విచారించిన సమయంలోనే బియ్యం మాయం కేసులో పేర్ని నాని పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే పేర్ని నాని పేరును ఏ6గా ఎఫ్ఆర్ఐలో నమోదు చేశారు.

Also Read : పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ