Chandrababu Naidu: పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని యల్లమందలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

Chandrababu Naidu: పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ

Chandrababu Naidu

Updated On : December 31, 2024 / 1:01 PM IST

Pension Distribution : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో భాగంగా జిల్లాలోని నర్సరావుపేట మండలం యల్లమందలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శారమ్మ కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read: Today Top News: టుడే లేటెస్ట్ న్యూస్.. టాప్ హెడ్ లైన్స్

శారమ్మ కుమార్తెకు మంచి చదువు చెప్పించాలని, ఆమెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష రుణం ఇప్పించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటిని వెళ్లిన చంద్రబాబు.. స్వయంగా కాఫీ పెట్టి ఏడుకొండలు కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇంటి నిర్మాణం పూర్తికోసం రూ.5లక్షలు ఇప్పించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Also Read: Richest CM: దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు.. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే?

పింఛన్ల పంపిణీ అనంతరం స్థానికంగా నిర్వహించే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 2గంటల సమయంలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 3గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు తిరిగి ఉండవలిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Also Read: Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో బిగ్ ట్విస్ట్.. పేర్ని నానికి షాకిచ్చిన పోలీసులు

రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ. 2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 10గంటల సమయానికే 53,22,406 మందికి రూ.2,256 కోట్లు నగదు పంపినీ చేసినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నారా.. లేదా అనే విషయాన్ని జీయో ట్యాగింగ్ ద్వారా అధికారులు గమనిస్తున్నారు.