CM Chandrababu Naidu,
CM Chandrababu Naidu: విశాఖపట్నం ప్రధాన వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. జూన్ 21న నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానుండటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు ‘యోగా మాసం’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే అని అన్నారు.
Also Read: AP Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
జూన్ 21న యోగా డే ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, యోగాకి ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని చంద్రబాబు అన్నారు. వచ్చే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకుంటున్నామని, ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలకు యోగా ఒక నాంది. ప్రతిఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని సూచించారు. యోగా వల్ల పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
ఇవాళ్టి నుంచి జూన్ 21వ తేదీ వరకు ఏపీలో యోగాంధ్ర జరుపుకోవాలని, జూన్ 21వ తేదీన విశాఖలో ఐదు లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖ సాగరతీరంలో ఆరోజు ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు యోగా డే జరుగుతుందని చెప్పారు. అందరికి ఆరోగ్యం, ఆనందం యోగా వల్ల కలుగుతుందని, ప్రతి మనిషిలో యోగా వల్ల ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుందని, ప్రతి మనిషి రోజుకు ఒక గంట యోగా చేయడం అలవాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. యోగా వల్ల మనిషిలో శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు.