మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఏంటంటే..

మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Cm Chandrababu Naidu : కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. కొందరు చేసే తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు. కేబినెట్ భేటీలో మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఈ సందర్భంగా.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి చెడ్డ పేరే హైలెట్ అవుతోందంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

రివర్స్ టెండరింగ్ విధానంపై కేబినెట్ లో కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని క్యాబినెట్ అభిప్రాయపడింది. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని.. ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ క్యాబినెట్ లో చర్చ జరిగింది. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడీషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని క్యాబినెట్ భావించింది. తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోద ముద్ర వేసేలా జుడీషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని పలువురు మంత్రులు అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జుడీషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలని పలువురు మంత్రులు కోరారు.

ఉచిత ఇసుక పాలసీ అమలుపై మంత్రివర్గంలో డిస్కషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్ లో పడుతోందన్నారు. టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా క్యాబినెట్ అంగీకారం తెలిపింది. సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపిస్తే.. విమర్శలు వస్తాయేమోనని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరింత అధ్యయనం చేసి సార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ భావించింది.

రేషన్ బియ్యం డెలివరీ వాహనాలను రద్దు చేయాలనే నిర్ణయంపై క్యాబినెట్ లో చర్చించారు. వాహనాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు అధికారులు చెప్పారు. రేషన్ బియ్యం డెలివరీ వాహానాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. బ్యాంక్ లింకేజీ ఉన్నందున ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు సీఎం చంద్రబాబు. ఫ్రీ హోల్డ్ లోకి వెళ్లిన భూముల్లో ఎక్కువగా 5వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు సత్యసాయి జిల్లాలోనే జరిగాయని అధికారులు తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ ను డీటైల్డ్ గా విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

 

 

Also Read : వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!

 

ట్రెండింగ్ వార్తలు