మూడుపై ముందడుగు : రాజధాని రైతులకు జగన్ శుభవార్త

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే

  • Publish Date - January 20, 2020 / 07:05 AM IST

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. సోమవారం(జనవరి 20,2020) ఉదయం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు సహా రైతులకు న్యాయం గురించి చర్చించారు.

రాజధానికి భూములిచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను 10 నుంచి 15 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి రైతులకు ఎలా న్యాయం చేయాలని దానిపై చర్చించిన కేబినెట్.. ఈ మేరకు నిర్ణయాలు తీసుంది. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. ఏపీకి త్రీ కేపిటల్స్ ఇక లాంఛనమే. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11.15నిమిషాలకు అసెంబ్లీ ప్రారంభమైంది. వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేపె పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.

ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై మంత్రి బుగ్గన చర్చ స్టార్ట్ చేశారు. మూడు రాజధానుల అంశాన్ని వికేంద్రీకరణ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ, జ్యుడీషియల్ కేపిటల్ గా కర్నూలు ఉంటాయని ప్రకటించారు. సచివాలయం, రాజ్ భవన్, హెచ్ ఓడీ ఆఫీసులు విశాఖలోనే ఉంటాయని మంత్రి చెప్పారు. 

వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యం అని మంత్రి బుగ్గన చెప్పారు. సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే ప్రాంతీయ అసమానాలు తలెత్తాయన్నారు. ప్రజలు రాజభవనాలు కోరుకోవడం లేదన్న మంత్రి బుగ్గన.. ప్రజలకు కావాల్సింది భద్రత, వసతులు అని చెప్పారు.