CM Jagan : వారి ఖాతాల్లోకి రూ.703 కోట్లు.. ఏపీ ప్రభుత్వం తీపికబురు

అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు..

CM Jagan : అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణంతో సంక్షేమ పథకాలు పొందని వారికి ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌ నెలల్లో లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం తెలిపింది.

జగన్ సీఎం అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లెక్క చేయకండా నగదు జమ చేస్తున్నారు. ఆ వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సీఎం జగన్ సాయం అందిస్తున్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న హస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు జగన్.

ట్రెండింగ్ వార్తలు