YSRCP Samajika Sadhikara Bus Yatra (Photo : Google)
YSRCP Samajika Sadhikara Bus Yatra : సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి జోగి రమేశ్. దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అంటూ జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. సామాజిక సాధికార యాత్ర చేసిన దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి సీఎం జగన్ మాత్రమే అన్నారు మంత్రి జోగి రమేశ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదలు ఇలా అన్నీ కలిసిన పార్టీ జగనన్న పార్టీ అని చెప్పారాయన.
ఇచ్చాపురం, సింగమను, తెనాలి ఈ మూడు ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దమ్ముగా ధైర్యంగా బస్సు ఎక్కి తిరుగుతున్నారని మంత్రి జోగి రమేశ్ చెప్పారు. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏమన్నా కావాలంటే దొరల దగ్గరకి వెళ్ళాలని.. ఇప్పుడా పరిస్థితి లేదని.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్ తోడుగా నిలిచారని మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.
17మంత్రి పదవులు వారికే- జోగి రమేశ్
‘రాష్ట్రంలో 25మంది మంత్రులు ఉంటే 17 మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇచ్చిన ఘనత జగన్ ది. పేదల ఖాతాల్లో నేరుగా కోట్లు రూపాయలు జమ చేశారు. అవినీతి చేసిన చంద్రబాబు జైలుకెళ్ళారు. రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు కోట్లు ఎలా సంపాదించారు? చంద్రబాబు.. వెన్నుపోటు ఎంత మందికి పొడిచారో మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. తెనాలిలో పోటీ చేసేది టీడీపీనో జనసేనో ఏదో చెప్పగలరా? అన్నాబత్తుని శివకుమార్ మీద పోటీ చేసే సత్తా ఎవరికీ లేదు. మన జగన్ ని మనమే నిలబెట్టుకోవాలి. కాపాడుకోవాలి. జగన్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కంకణం కట్టుకున్నారు’ అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.
Also Read : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న
ఇంతలా ప్రోత్సహించింది జగన్ ఒక్కరే- డొక్కా మాణిక్య వరప్రసాద్
గుంటూరు జిల్లా తెనాలిలో సామాజిక సాధికార యాత్ర జరగటం శుభసూచకం. ఇప్పటివరకు సామాజిక న్యాయం చేశాము. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా పేదలకు న్యాయం చేస్తాం. మధ్యవర్తి లేకుండా sc st bc మైనార్టీలకు 3లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాము. పేదలకు కావాల్సిన విద్య, వైద్యలో పెను మార్పులు జగన్ తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సీఎం జగన్ లా ప్రోత్సహించింది ఎవరూ లేదు. ఎన్నికల ముందు మీకు ఇంత చేశాము మళ్ళీ గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తామని బస్సు యాత్ర ద్వారా చెబుతున్నాం. బడుగు బలహీనవర్గాలకు గౌరవo కల్పించిన ప్రభుత్వం వైసీపీ అని, 130 బీసీ కులాలకు న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
సీఎం జగన్ చరిత్ర తిరగరాశారు- మాజీమంత్రి కొలుసు పార్థసారధి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చరిత్ర తిరగరాశారు. సాధికారత తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వంకే దక్కుతుంది. 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్. గత ప్రభుత్వాలు సామాజిక సాధికారత దూరం చేస్తే వైసీపీ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. బలహీనవర్గాలకు న్యాయం చేసున్న మిత్రుడు ఎమ్మెల్యే శివకుమార్. మైనారిటీలకు మున్సిపల్ ఛైర్మన్ ఇచ్చిన ఘనత శివకుమార్ దే.
Also Read : కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము