నెరవేరనున్న రాయలసీమ వాసుల చిరకాల కోరిక : సీఎం చేతుల మీదుగా నేడే శంకుస్థాపన
రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న

రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది… ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న
రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది… ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న నినాదాలకు సార్ధకత చేకూరనుంది.. ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమకు నేడు(డిసెంబర్ 23,2019) శంకుస్థాపన జరగనుంది.
కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ కావాలన్న రాయలసీమ వాసుల చిరకాల కల నెరవేర బోతోంది. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు.
ఉక్కు పరిశ్రమ కోసం కడప జిల్లాలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో.. ప్రజల ఆకాంక్ష మేరకు బ్రాహ్మణి స్టీల్స్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జమ్మల మడుగు సమీపంలో 10వేల ఎకరాల్లో బ్రాహ్మణి కర్మాగారం పనులు చేపట్టారు. గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు 60శాతం పూర్తయ్యాయి. తరువాత రాజశేఖర రెడ్డి అకాల మరణం.. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కావడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. కేంద్రం సహకరించకున్నా.. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. జమమ్మలమడుగు మండలం కంబాలదిన్నె దగ్గర ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 3వేల 400ఎకరాలు సేకరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్.. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్.
ఇవాళ్టి(డిసెంబర్ 23,2019) నుంచి మూడు రోజుల పాటు కడపలో పర్యటించనున్న సీఎం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.. ఇందులో భాగంగా తొలిరోజు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.. ఇక మంగళవారం ఇడుపుల పాయ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు నిర్వహించనున్నారు జగన్.
నేడు(డిసెంబర్ 23,2019) శంకుస్థాపన చేయనున్న ఉక్కు ఫ్యాక్టరీని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కడప జిల్లాల్లో ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా లక్ష మందికి లబ్ది చేకూరనుంది.