CM Jagan Public Meeting
CM Jagan Public Meeting : అసైన్డ్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా డీకేటీ పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని తెలిపారు.
రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే చేస్తామని పేర్కొన్నారు. రైతుల భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. సరిహద్దు సమస్యలన్నీ పరిష్కరించామని చెప్పారు. అసైన్డ్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భూ రికార్డులు అప్ డేట్ చేశామని తెలిపారు. 2023 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
Top Headlines : గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా..? : రాహుల్ గాంధీపై కవిత సెటైర్లు
పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదన్నారు. చుక్కల భూముల సమస్యలకు కూడా పరిష్కారం చూపించామని తెలిపారు. లంక భూములకు అసైన్ మెంట్ పట్టాలు ఇస్తామని చెప్పారు. 27.41 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కులు కల్పించామని తెలిపారు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేద రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,44,866 ఎకరాల భూ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.