YSR Cheyutha 2024 Funds : చెక్ చేసుకోండి.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.18,750 జమ
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు.

YSR Cheyutha 2024 Funds
YSR Cheyutha 2024 Funds : వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో 26లక్షల 98వేల 931 మంది లబ్దిదారుల ఖతాల్లో బటన్ నొక్కి రూ.5060.49 కోట్లు(5వేల 60కోట్లు) జమ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18వేల 750 ఇస్తున్నారు. నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం 75వేలు ఆర్థికసాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ స్కీమ్ కింద 45 నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు సాయం అందిస్తోంది ప్రభుత్వం. వైఎస్ఆర్ చేయూత ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. అక్క, చెల్లెమ్మలకు అండగా ఉంటున్నాము అని సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ద్వారా ఒక్కో మహిళకు రూ.75వేలు ఇచ్చామన్నారు. పథకం అమలులో ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. నేరుగా లబ్దిదారులకు నిధులు జమ చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మొత్తంగా 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు లబ్ది పొందారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు గతంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పనులు చేశాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
Also Read : టీడీపీలో కొత్త తరహా రాజకీయం.. ఎలాంటి నష్టం జరుగుతుందో అనే ఆందోళనలో అధిష్టానం