Ap Prc
CM Jagan PRC : ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీని ఫైనల్ చేసేందుకు ఏపీ సర్కార్ సమాలోచనలు చేస్తోంది. పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్‌లు ఏంటన్న విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఉద్యోగులకు ఎంత మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న దానిపై చర్చించారు.
Read More : Vangaveeti Radha : అభిమానులే నాకు రక్షణ.. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్స్‌ని వెనక్కిపంపిన వంగవీటి రాధా
14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మధ్యంతర భృతి కన్నా తక్కువ పీఆర్సీ ఇస్తే జీతాలు తగ్గిపోతాయంటూ ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. పీఆర్సీ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై చర్చించనున్నారు. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్.
Read More : Prakash Javadekar : వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ కరప్షన్ పార్టీలు : ప్రకాశ్ జవదేకర్
పీఆర్సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆర్థిక శాఖ సమావేశంలో పిఆర్సీపై చర్చ జరిగిందన్నారు. ఉన్నంతలో ఎంతో కొంత అధికంగా ఇవ్వాలని ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు సజ్జల. ఏపీ ఆర్థిక పరిస్థితి బాలేనందున కొంత ఆలోచించాల్సి వస్తోందన్నారు. పీఆర్సీతో పాటు డీఏ పెండింగ్ ఉందని…అనేక వియాలు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు సజ్జల.