Vangaveeti Radha : అభిమానులే నాకు రక్షణ.. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్స్‌ని వెనక్కిపంపిన వంగవీటి రాధా

నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, అందుకే గన్ మెన్లను వద్దని చెప్పాను. అన్ని పార్టీల నుంచి నా శ్రేయస్సు గురించి అడుగుతూ ఫోన్లు వచ్చాయి.

Vangaveeti Radha : అభిమానులే నాకు రక్షణ.. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్స్‌ని వెనక్కిపంపిన వంగవీటి రాధా

Vangaveeti Radha

Vangaveeti Radha : తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. భద్రతలో భాగంగా ఆయనకు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ భద్రతను వంగవీటి రాధ తిరస్కరించారు. గన్ మెన్లను ఆయన తిప్పి పంపేశారు. తన అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు. గన్ మెన్లు వద్దన్న మాట వాస్తవమే అని చెప్పిన వంగవీటి రాధా మీడియాతో చిట్ చాట్ చేశారు. ”నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, అందుకే గన్ మెన్లను వద్దని చెప్పాను. అన్ని పార్టీల నుంచి నా శ్రేయస్సు గురించి అడుగుతూ ఫోన్లు వచ్చాయి. పార్టీలకు అతీతంగా నాతో మాట్లాడారు. అన్ని పార్టీల వారితో నాకు పరిచయాలున్నాయి. పోలీసులు ఇప్పటివరకు రాలేదు. వచ్చినపుడు స్పందిస్తాను” అని రాధా అన్నారు.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

దీనిపై గన్ మెన్లు స్పందించారు. నాకు గన్ మెన్లు అవసరం లేదు, వెళ్లిపోవాలని రాధా తమతో చెప్పారన్నారు. ఈ విషయాన్ని తాము ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. అధికారులు తమను వచ్చేయమన్నారని, అందుకే వెళ్లి పోతున్నాము అని వారు వెల్లడించారు.

New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

తన హత్యకు కుట్ర జరిగిందని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు తన హత్యకు కుట్ర చేశారని.. రెక్కీ కూడా నిర్వహించారని ఆయన ఆరోపించారు. హత్యకు కుట్ర చేసింది ఎవరో త్వరలోనే తెలుస్తుందన్నారు. దీనిపై కలకలం రేగింది. రాధా చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. రాధాకు 2+2 గన్‌మెన్‌ను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ డీజీని కూడా ఆదేశించారు. రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం సూచించారు.