CM Jagan review
Rains Floods – Rehabilitation : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి సచివాలయ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలు అలర్ట్ గా ఉండాలన్నారు.
ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయ శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అధికారులు శిబిరాల్లో ఉండి ప్రజలు ఎలాంటి సదుపాయాలు కోరుకుంటారో అలాంటి సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందించాలన్నారు.
BJP Leaders : వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు.. 8 ఉమ్మడి జిల్లాలకు ఎనిమిది బృందాలు
అదే వ్యక్తులకైతే రూ.1000 అందించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఫామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు. వరద పరిస్థితులను తమ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు.
ముంపు గ్రామాలు, లంకలపై శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. లంక గ్రామాల్లో జనరేటర్ల లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఇక తాగు నీటి కొరత లేకుండా చూడాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
YCP Leaders : ఆస్తులు కాపాడుకోవడానికే టీడీపీ అభ్యర్థి భరత్ పోటీ : వైసీపీ నేతలు
ఇక విలేజ్ క్లినిక్స్ పీహెచ్ సీల్లో సరిపడా మందులు ఉంచుకోవాలని సూచించారు. వరద తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యువరేషన్ జరగాలని సీఎం అధికారులకు సూచించారు.