YCP Leaders : ఆస్తులు కాపాడుకోవడానికే టీడీపీ అభ్యర్థి భరత్ పోటీ : వైసీపీ నేతలు
టీ.జీ.భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డాక్టర్ ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూడటానికి కూడా రాలేదు పైగా డాక్టర్ ఇస్మాయిల్ పై నెగెటివ్ ప్రచారం జరిగితే కనీసం స్పందించలేదన్నారు.

Hafeez Khan - BY Ramaiah
TG Venkatesh – TG Bharath : టీ.జీ వెంకటేశ్, టీ.జీ భరత్ పై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. టీడీపీపై కర్నూలు మేయర్ బివై రామయ్య ఫైర్ అయ్యారు. టీడీపీ కర్నూలు అసెంబ్లీ స్థానంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి సవాల్ అని అన్నారు. సొంత తండ్రి కొడుక్కి ఓటు వేయలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తండ్రి టీ.జీ.వెంకటేష్ బీజేపీ, తనయుడు టీ.జీ.భరత్ టీడీపీ అని తెలిపారు. ఆస్తులను కాపాడుకోవడానికే టీడీపీ అభ్యర్థి భరత్ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు.
సొంత ఇంట్లోనే టీడీపీ అభ్యర్తికి ఓట్లు పడవు.. అలాంటి వాళ్ళు కర్నూలు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇద్దరు దిక్కులేని ప్రతిపక్షనాయకుల్లా తిరుగుతున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి ఆయువు పట్టు అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండ అమలు చేస్తున్నామని తెలిపారు.
టీ.జీ.భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డాక్టర్ ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూడటానికి కూడా రాలేదు పైగా డాక్టర్ ఇస్మాయిల్ పై నెగెటివ్ ప్రచారం జరిగితే కనీసం స్పందించలేదన్నారు. టీ.జీ భరత్ పారిశ్రామిక వేత్త కావచ్చు కానీ ప్రజానాయకుడు మాత్రం ఏప్పటికి కాలేడని విమర్శించారు.
ఆస్తులు కాపాడుకోవడానికి, ఫ్యాక్టరీలు కాపాడుకోవడానికి తండ్రి ఒక పార్టీ, కొడుకు మరో పార్టీ అని విమర్శించారు. “మీలాగా ఆస్తులు కాపాడుకోవడానికి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మేము వెళ్లబోము” అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాలోకి వచ్చామని తెలిపారు.