AP Cabinet Expansion : త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ.. ఆశావహులు వీరే..!

చాలాకాలంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్‌ తేల్చి చెప్పారు.

AP cabinet expansion : మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారు. ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తేల్చి చెప్పారు. మొత్తం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగినా.. కొందరిని కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు.

చాలాకాలంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. అంతేగాకుండా పునర్‌ వ్యవస్థికరణలో పదవులు కోల్పోయిన వారంతా పార్టీ కోసం పని చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వారందరికి జిల్లా ఇంచార్జ్‌ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిపారు.

CM Jagan : కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

ఐదారుగురు మినహా మిగతా అందరిని పదవుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరి పదవులు ఉంటాయి.. ఎవరి పదవులు ఊడతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఐదాగురు మినహా మిగతా మంత్రులందర్నీ మార్చే ఛాన్స్ ఉంది. అయితే పలు జిల్లాల నుంచి కొంత మంది మంత్రి పదవులను ఆశించే ఆశావహులు ఉన్నారు.

కర్నూలు జిల్లా నుంచి ఆర్థర్ (ఎస్పీ), బాలనాగి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి. అనంపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రబారెడ్డి. కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా ఉన్నారు.

CM Jagan : ఎన్టీఆర్ నుంచి మోడీ దాకా‌ అందరినీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు : సీఎం జగన్

గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫా, మర్రి రాజశేఖర్, విడదల రజిని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, జోగి రమేష్ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), పొన్నడా సతీశ్, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా ఉన్నారు.

విశాఖ జిల్లా నుంచి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం ఉన్నారు. అయితే తమ్మినేని సీతారం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు