CM Jagan: సీఎం జగన్ గుంటూరు పర్యటన నేడే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్ లోని ఐటీసీ సంస్థ నిర్మించిన స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

CM Jagan: సీఎం జగన్ గుంటూరు పర్యటన నేడే

Cm Jagan

Updated On : January 12, 2022 / 7:34 AM IST

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్ లోని ఐటీసీ సంస్థ నిర్మించిన స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10గంటల 45నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా పోలీస్ మైదానానికి చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద దిగి.. అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా హోటల్ కు చేరుకుంటారు.

ఉదయం 11గంటలకు సీఎం చేతుల మీదుగా ప్రారంభించి ఒక 45 నిమిషాల పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు.

ఇది కూడా చదవండి: వంగవీటి రాధ, కొడాలి నానికి కరోనా..