Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. అవినాష్ ఇంటికి సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దేవినేని అవినాష్ తన ఇంటికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

cm jagan went to devineni avinash house in vijayawada

CM Magan- Devineni Avinash: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో (Gunadala) నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ (Hyatt Place Vijayawada) ఆయన ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు. సీఎం జగన్.. అవినాష్ ఇంటికి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తమ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను దేవినేని అవినాష్ తన ఇంటికి ఆహ్వానించారు. అవినాష్ ఆహ్వానం మేరకు సీఎం జగన్.. ఆయన ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తన ఇంటికి విచ్చేసిన జగన్ కు అవినాష్ సాదర స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తమ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అరగంట పాటు అవినాష్ నివాసంలో గడిపిన తర్వాత సీఎం జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లికి తిరిగి వెళ్లారు.

కాగా, హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, జోగి రమేశ్, తానేటి వనితతో పాటు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. హయత్ ప్లేస్ చైర్మన్ ఆర్ వీరాస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ సిహెచ్ రామకృష్ణ తదితరులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు.

Also Read: చంద్రబాబుది గాంధీ సిద్ధాంతం, లోకేష్ ది భగత్ సింగ్ సిద్ధాంతం : బుద్ధా వెంకన్న

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో పర్యాటక అభివద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. విజయవాడలోనే కాకుండా ఇలాంటి హోటల్స్ రాష్ట్రమంతటా రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నామని తెలిపారు. హయత్ ప్లేస్ హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు చెప్పారు.

Also Read: త్రిశూల వ్యూహంతో కాకపుట్టిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేశ్!

ట్రెండింగ్ వార్తలు