చిరంజీవి మరిన్ని సినిమాలు చేసి ఖ్యాతి పెంచాలి: సీఎం జగన్

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మరిన్ని సినిమాలు తీయాలనే ఆకాంక్షను తెలిలయజేశారు. ‘పద్మభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు.
మామూలుగానే ఆగష్టు 22 ఉదయం నుంచి మెగా అభిమానులంతా బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ల వరద కురిపిస్తుండగా.. సీఎం చేసిన ట్వీట్ కు క్షణాల్లోనే 6వేల లైకులు సంపాదించుకుంది.
పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2020