వైఎస్ జగన్ అనే నేను… @365 ఏడాది పాలన ట్రైలర్

  • Publish Date - May 30, 2020 / 11:25 AM IST

సీఎంగా జగన్ పాలనకు ఏడాది అవుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ అనే నేను.. ఆరుకోట్ల ఆంధ్రులకు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నానని మరోసారి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి @365 పూర్తి అయిన సందర్భంగా ఏపీ అభివృద్ధికి పునరంకితం అవుదామని జగన్ పిలుపునిచ్చారు. తన ఏడాది పాలనలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వైయస్ జగన్‌ అనే నేను ఆరుకోట్ల ఆంధ్రులకు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నానని మరోసారి ప్రమాణం చేస్తున్నాను. 

వైసీపీ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. రైతు పక్షపతి ప్రభుత్వం తమదని జగన్ అన్నారు. ఈ  ఏడాది కాలంగా రైతులు, కార్మికులు, మహిళలు, ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థతో మెరుగైన పాలన అందించామని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం, అమ్మ ఒడితో పిల్లల విద్యకు బాసటగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నట్టు తెలిపారు.

రైతు భరోసా ద్వారా వ్యవసాయానికి ఊతం ఇచ్చినట్టు పేర్కొన్నారు. 11 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కోట్ల మందిని కలిసినట్టు చెప్పారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 90 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. 

Read: ప్రజా సంక్షేమంపై నా సంతకం ఇది.. ఏడాది పాలనపై గర్వంగా చెప్పిన జగన్