Coal Crisis AP : ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే

బొగ్గు కొరత వల్ల కరెంటు కోతలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ముందుగా గృహ వినియోగదారులపై ప్రభావం పడనుంది.

Power Cuts In Andhra Pradesh : అందరూ అనుకున్నట్లే అయ్యింది. బొగ్గు కొరతతో త్వరలోనే కరెంటు కష్టాలు ఎదురవుతాయని ఊహించిన సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో కూడా ఇలాంటి కష్టాలే నెలకొన్నాయి. ప్రస్తుతం బొగ్గు కొరత వల్ల కరెంటు కోతలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ముందుగా గృహ వినియోగదారులపై ప్రభావం పడనుంది. సాయంత్రం 06 గంట లనుంచి రాత్రి 10.30 మధ్య పవర్ కట్స్ ఉండనున్నాయి. ఏపీలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా…ప్రస్తుతం 145 మిలియన్ యూనిట్లే సరఫరా అవుతోంది.

Read More : Coal Shortage : రంగంలోకి అమిత్ షా..బొగ్గు ,విద్యుత్ శాఖ మంత్రులతో భేటీ

ఈ క్రమంలో విద్యుత్ కోతలే శరణ్యమని ఏపీ సర్కార్ భావించింది. ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 09 గంటల వరకు కరెంటు కోతలు విధించనున్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాలకు యథావిధిగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. బొగ్గు కొరత ఉండడంతో మరో 20 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుందని తెలుస్తోంది. వ్యవసాయానికి మాత్రం కరెంటు సరఫరా ఉంటుందని, వారికి పవర్ కట్ చేయమని విద్యుత్ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రూ. 470 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకపోయాయని అంచనా.

Read More : Coal Shortage : ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం..నాలుగు ప్రధాన కారణాలు ఇవే

బొగ్గు కొరత తీవ్రంగా ఉందని సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే..బొగ్గు కొరత తీర్చే ప్రయత్నంలో ఉన్నామని..అవసరం లేదని కేంద్రం వెల్లడిస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ పెరగడంతో..కరెంటు కోతలు కంపల్సరీ అయ్యాయి. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో…కోతలు తప్పనిసరిగా విధించాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఏపీ జ న్ కో ఆధ్వర్యంలో రెండు థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి.

Read More : CM Kejriwal : ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం, కాపాడమంటూ..కేంద్రానికి మొర

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 185 మిలియన్ యూనిట్ల నుంచి 190 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం కేవలం 45 శాతం విద్యుత్ ను మాత్రమే అందిస్తున్నారని తెలుస్తోంది. కరోనా అనంతరం గత ఆరు నెలల్లోనే విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణస్థితిలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందా ? లేదా ? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు