Rain Alert
Rain Alert : ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షకు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర పేర్కొంది. తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీచేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖవాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరప్రాంతంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో గత రెండు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భద్రాచలం, సూర్యాపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.