×
Ad

Perni Nani : వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు..

Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను దూసిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని

Perni Nani

  • వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు
  • టీడీపీ నేతల ఫిర్యాదు.. ఇనగుదురు పీఎస్‌లో కేసు
  • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను దూసిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీటీడీ నేతల ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని ఇనగుదురులపేట పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. 196(1), 353(2), 351(2), 352 ఆఫ్ బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.

Also Read : APPSC : ఏపీలో గ్రూప్-2 పరీక్షల తుది ఎంపిక జాబితా వచ్చేసింది.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారంటే?

గత రెండు రోజుల క్రితం నూజివీడులో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ మతపరమైన మనోభావాలను పదెబ్బతీసేలా, ఇరు వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ నాయకులు ఇనగుదురు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.