Ex MLA Pichhireddy : అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి మృతి

వైసీపీ నేత దర్శి మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి మృతి చెందారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.

Ex Mla Pichhireddy

Ex MLA Pichhireddy : ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు 1989, 1999లలో దర్శి ఎమ్మెల్యేగా పనిచేశారు పిచ్చిరెడ్డి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

చదవండి :  కర్నూలు జిల్లా అడవుల్లో క్షుద్రపూజల కలకలం