అప్పు తీరుస్తామని ఇంటికి పిలిచి.. మహిళపై అత్యాచారయత్నం

  • Publish Date - June 12, 2020 / 05:04 PM IST

అప్పు తీరుస్తాం ఇంటికి రా అన్నారు.. అది నమ్మి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారో ఇద్దరు. తన మిత్రుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేసేందుకు కానిస్టేబుల్ పథకం వేశాడు. కానీ, బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహిళ నుంచి రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడో కానిస్టేబుల్. అయితే తీసుకున్న అప్పుడు చెల్లిస్తానని ఇంటికి పిలిచాడు. తన స్నేహితుడిని ఆమెపై అత్యాచారానికి ఉసిగోల్పాడు. 

బాధితురాలు ఎలాగో తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడు సహా స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వెంకట రాజేష్ అనే కానిస్టేబుల్ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో రైటర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఓ మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది.

ఓ రోజు ఆమె దగ్గర రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సన్నిహితంగా ఉంటూనే ఆమె నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. డబ్బులు చెల్లించమని అడిగితే ఆ ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఈ నెల 8న అప్పు చెల్లిస్తానని చెప్పి రమ్మని పిలిచాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేష్ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకుంది.