CM Chandrababu, Pawan Kalyan
ఫ్యూచర్లో అడ్డంకులు రావొద్దు. అపోహలకు కూడా తావు లేదు. సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. గత ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు. మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావొద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతే. ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది.
అందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజిట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు ఎన్డీయే సర్కార్లో భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే 15వేల కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించారు చంద్రబాబు. మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంకా మిగతా ప్రాజెక్టుల కోసం కూడా నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెప్తోంది కూటమి సర్కార్.
విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతే రాజధాని అని శాసనసభలో తీర్మానం చేసింది. టీడీపీ అయిదేళ్ళ పాలనలో అమరావతి రాజధానిగానే చాలా కార్యక్రమాలు చేపట్టారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంపై గొప్పగా డిజైన్లు తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు. ప్రధాని మోదీని ఆహ్వానించి..రాజధాని పనులను గొప్పగా ప్రారంభించారు. సెక్రటేరియట్తో పాటు కొన్ని బిల్డింగ్స్ పనులు కూడా పూర్తయ్యాయి.
Also Read: ఇలా చేస్తే భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం తలంబ్రాలు మీ ఇంటికే వస్తాయ్..
పీఎంను ఇన్వైట్ చేసి పనులు పునః ప్రారంభం!
ఆలోగా వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి రాజధాని ప్రభ మసకబారింది. దానికి బదులుగా మూడు రాజధానుల కాన్సెప్ట్ ను ముందుకు తెచ్చింది వైసీపీ. అలా ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేక జోకులు వేసుకునే పరిస్థితి ఉండేది. అమరావతి క్యాపిటల్ గా ఉండదేమోనని వచ్చే ఇన్వెస్టర్లు కూడా రాలేదు.
గతంలో చేపట్టిన ప్రాజెక్టులు మూలకు పడ్డాయి. ఓ రకంగా క్యాపిటల్ సిటీ కళ తప్పింది. 2024లో తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల మీద దూకుడు పెంచింది. రాజధాని అమరావతికి ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ పనులు జెట్ స్పీడ్తో పూర్తి చేసింది. త్వరలోనే మళ్లీ అమరావతి పనులు మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్.
గతంలోనే మోదీ చేతుల మీదగా అమరావతికి శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు మరోసారి పీఎంను ఇన్వైట్ చేసి పనులు పునః ప్రారంభం చేయాలని అనుకుంటోంది. అంతేకాదు రాజధాని విషయంలో వైసీపీని పూర్తిస్థాయిలో కార్నర్ చేస్తోంది. ఇంత జరిగాక..ఇప్పటికీ మూడు రాజధానుల కాన్సెప్ట్కే కట్టుబడే ఉన్నారా అంటూ నిలదీస్తోంది.
అపోజిషన్ మాత్రం క్యాపిటల్ విషయంలో తమ స్టాండ్ ఏంటో చెప్తామ్ అంటున్నారే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అమరావతి విషయంలో ఈసారి జనాలకు క్లియర్ కట్ పిక్చర్ వచ్చేలా పనులు చేపడుతోంది కూటమి సర్కార్. ఫ్యూచర్లో ఎలాంటి కన్ఫ్యూజన్, క్లాషెస్ లేకుండా..అమరావతే రాజధాని అని అందరూ ఫిక్స్ అయిపోయేలా పక్కా స్కెచ్ను ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు.
బ్యాగ్రౌండ్ వర్క్
ఏపీకి రాజధాని అమరావతి అని కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా బ్యాగ్రౌండ్ వర్క్ చేస్తోంది. మరోసారి ప్రధాని చేతుల మీదుగా పనులు ప్రారంభించి.. నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడంతో..మోదీ నోట అమరావతే రాజధాని అని ప్రకటన చేయించేలా ప్రయత్నం చేస్తోంది. అప్పుడు ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుందని.. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా..ప్రభుత్వాలు మారినా.. అమరావతి దానంతట అదే డెవలప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని భావిస్తోంది.
అమరావతే రాజధాని అని క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో ఏర్పడిన గందరగోళానికి..ఈ ఎనిమిది నెలల్లో కొంత వరకు చెక్ పెట్టారు. వీలైనంత త్వరగా రాజధాని మీద కేంద్రం గెజిట్ ఇస్తే..ప్రధాని చేతుల మీదుగా మళ్లీ పనులు ప్రారంభించి..అమరావతి నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట. ఫ్యూచర్లో రాజధానిని మారుస్తారేమోనన్న ఊహాగానాలు, అనుమానాలు రాకుండా.. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.