Sri Rama Navami 2025: ఇలా చేస్తే భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం తలంబ్రాలు మీ ఇంటికే వస్తాయ్..

సీతారాముల కల్యాణం తర్వాత వీటిని పంపిస్తారు.

Sri Rama Navami 2025: ఇలా చేస్తే భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం తలంబ్రాలు మీ ఇంటికే వస్తాయ్..

Updated On : March 18, 2025 / 12:15 PM IST

భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలని కోరుకుంటున్నారా? మీ ఇంటి వద్దకే ఆ తలంబ్రాలను తెప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది టీజీఆర్టీసీ. భద్రాద్రిలో ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. స్వామివారి కల్యాణాన్ని కళ్లారా చూసి తరిద్దామని చాలా మంది భావిస్తుంటారు.

అయితే, ఆర్థిక కారణాలో, సమయం దొరకకో, అనారోగ్య కారణాల వల్లో వెళ్లలేకపోతుంటారు. భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని టీవీల్లోనే చూస్తారు. భద్రాద్రికి వెళ్లలేకపోతున్నప్పటికీ దేవాదాయశాఖ సాయంతో భక్తుల ఇంటికి తలంబ్రాలను తెచ్చి అందిస్తామని టీజీఆర్టీసీ చెప్పింది. తలంబ్రాలు కావాలనుకుంటున్న వారు ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కేంద్రాలలో సంప్రదించవచ్చు.

Also Read: యాహూ.. ముగిసిన అన్‌డాకింగ్‌ ప్రక్రియ.. భూమి మీదకు వచ్చేస్తున్న సునీతా విలియమ్స్‌

లేదంటే tgsrtclogistics.co.inలో వివరాలు నమోదు చేసి తలంబ్రాలు తెప్పించుకోవచ్చు. ఇందుకుగానూ రూ.151 చెల్లించాల్సి ఉంటుంది. సీతారాముల కల్యాణం తర్వాత వీటిని పంపిస్తారు. సందేహాలు ఉంటే 040 69440069 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.