Minister Narayana
Minister Narayana: సీఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రూ.514 కోట్లతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే అక్కడ అదనపు మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూ.194 కోట్లు.. 9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు అనుమతి ఇచ్చింది. రూ.517 కోట్ల తో టెండర్లకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా రూ.1732.31 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు.
”190 ఎంఎల్ డీల వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు. రూ.568.57 కోట్లతో టెండర్. 15 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కోసం అనుమతి. 494 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి. 3.5 కిలోమీటర్ల ఈ3 రోడ్ ఎలివేటెడ్ రోడ్డుకు అనుమతి. ఈ 15, 13 రహదారులను జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అనుమతి. రూ.70, రూ.387 కోట్లతో చేపట్టేందుకు అనుమతి. జీవోఎంలోనూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం.
Also Read: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. గాలికి శిక్ష ఖరారు, సబితకు క్లీన్ చిట్..
లా యూనివర్సిటీకి 50 ఎకరాలు. క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు. బసవతారకం ఆస్పత్రికి అదనంగా మెడికల్ కాలేజీకి 6 ఎకరాలు కేటాయింపు. గతంలో ఈ సంస్థకు 15 ఎకరాలు కేటాయింపు జరిగింది. ఆదాయపు పన్ను శాఖ 0.78 ఎకరాలు. రెడ్ క్రాస్ సొసైటీ కి 0.78, కోస్టల్ బ్యాంకుకు 0.40 ఎకరాల కేటాయింపు. ఐఆర్ సీటీసీకి ఎకరా భూమి కేటాయింపు.
మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇవాళ 7 సంస్థలకు భూ కేటాయింపులను చేసింది. గతంలో 64 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. ఇప్పటి వరకూ 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయి” అని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.