Ap Corona Cases
COVID-19 Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రమదకరంగా మారుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. పొద్దున చూసిన వ్యక్తి..మరలా ఉదయం కనిపిస్తాడా ? లేదా ? తెలియని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు.
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 98 వేల 214 శాంపిల్స్ పరీక్షించగా..19 వేల 412 మంది కరోనా బారిన పడగా…దీని కారణంగా విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖపట్టణంలో ఏడుగురు, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు,
కర్నూలులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 11 వేల 579 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,64,88,574 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 11,18,207 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 79 వేల 402 మంది డిశ్చార్జ్ కాగా..8 వేల 053 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1772. చిత్తూరు 2768. ఈస్ట్ గోదావరి 2679. గుంటూరు 1750. వైఎస్ఆర్ కడప 792. కృష్ణా 694. కర్నూలు 1381. నెల్లూరు 1091. ప్రకాశం 1106. శ్రీకాకుళం 2048. విశాఖపట్టణం 1722. విజయనగరం 606. వెస్ట్ గోదావరి 1053. మొత్తం : 19,412.
Read More : Balakrishna : బళ్లారి బాలయ్య ఫ్యామిలీకి ‘అఖండ’ అభయం..
#COVIDUpdates: 01/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 11,18,207 పాజిటివ్ కేసు లకు గాను
*9,79,402 మంది డిశ్చార్జ్ కాగా
*8,053 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,30,752#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jHC3h30ICm— ArogyaAndhra (@ArogyaAndhra) May 1, 2021