Balakrishna : బళ్లారి బాలయ్య ఫ్యామిలీకి ‘అఖండ’ అభయం..

ఇటీవల బళ్లారికి చెందిన బాలయ్య బాబు వీరాభిమాని బళ్లారి బాలయ్య అనారోగ్యంతో మరణించారు.. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. బళ్లారి బాలయ్య భార్య, కొడుకుతో ఫోన్లో మాట్లాడారు..

Balakrishna : బళ్లారి బాలయ్య ఫ్యామిలీకి ‘అఖండ’ అభయం..

Balakrishna

Balakrishna: బాలయ్యకి ముక్కు మీద కోపం.. అభిమానులను, పార్టీ కార్యకర్తలను పబ్లిక్‌గానే కొడతాడు.. ఇది ఆయన కోపాన్ని చూసినవాళ్లు చెప్పే మాట.. పదిమందికి పెట్టినా మనమే.. నలుగురిని కొట్టినా మనమే.. ఇది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బాలయ్య క్యారెక్టర్ గురించి రాసిన మాట.. ఆయనకు కల్మషం తెలియదు.. పసిమనసు.. భోళాశంకరుడు బాలయ్య… ఇది ఆయనతో పని చేసినవాళ్లు, సినిమా పరిశ్రమ వాళ్లు చెప్పే మాట..

NBK

సినీనటుడు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యేగా నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే బాలయ్య, అభిమానులకు ఆపద వచ్చిందని తెలిస్తే చాలు.. తను ఎంత వరకు సాయం చెయ్యగలరో అంతకుమించి చేస్తారు.. ఆయన ద్వారా సాయం పొందిన ఎంతోమంది చెప్పే మాట ఇది.. ఇటీవల బళ్లారికి చెందిన బాలయ్య బాబు వీరాభిమాని బళ్లారి బాలయ్య అనారోగ్యంతో మరణించారు..

Akhanda Title Roar : యూట్యూబ్‌లో ‘అఖండ’ అరాచకం.. TFI లో ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్స్ వ్యూస్ టీజ‌ర్‌‌గా బాలయ్య రికార్డ్..

ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. బళ్లారి బాలయ్య భార్య, కొడుకుతో ఫోన్లో మాట్లాడారు.. వారిని పరామర్శించి, ధైర్యంగా ఉండండి.. ఏం కావాలన్నా అడగండి నేను చూసుకుంటానని చెప్పారు.. పిల్లలు ఎంత మంది, పెళ్లిళ్లయ్యాయా అంటూ వారి బాగోగులు తెలుసుకుని, ధైర్యం చెప్పారు బాలకృష్ణ.. కోపమొస్తే కొడతాడు కానీ మా బాలయ్య బంగారం అంటూ నందమూరి ఫ్యాన్స్ బాలయ్య ఫోన్ కాల్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..