Ap Covid 19 : ఏపీలో కరోనా కేసులు..ఒక్కరోజే..23 వేల 920 కేసులు..83 మంది మృతి..

COVID-19 Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 23 వేల 920 మందికి కరోనా సోకింది.

83 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,14,299 శాంపిల్స్ పరీక్షించగా..23 వేల 920 మంది కరోనా బారిన పడగా…దీని కారణంగా తూర్పుగోదావరిలో 12 మంది, విశాఖపట్టణంలో ఎనిమిది మంది, అనంతపూర్ లో 8 మంది, కృష్ణాలో 8 మంది, ప్రకాశంలో ఏడుగురు, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు,

పశ్చిమగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కర్నూలులో నలుగురు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 11 వేల 411 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 11,42,127 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 90 వేల 813 మంది డిశ్చార్జ్ కాగా..8 వేల 136 మంది మృతి చెందారని..ప్రస్తుతం 1,43,178 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1303. చిత్తూరు 2945. ఈస్ట్ గోదావరి 2831. గుంటూరు 2384. వైఎస్ఆర్ కడప 1055. కృష్ణా 989. కర్నూలు 2516. నెల్లూరు 1011. ప్రకాశం 1378. శ్రీకాకుళం 2724. విశాఖపట్టణం 1938. విజయనగరం 849. వెస్ట్ గోదావరి 1997. మొత్తం : 23,920.

Read More : West Bengal Election 2021 : మహిళను ఎగతాళి చేయకు మోదీకి టీఎంసీ నేత సూచన

ట్రెండింగ్ వార్తలు