Covid 19 : ఏపీలో కరోనా.. 3,116 శాంపిల్స్ పరీక్షిస్తే

గడిచిన 24 గంటల్లో 01 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,08,244 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది...

Andhra Pradesh Covid 19 Cases : మరోసారి కరోనా విరుచుకపడనుందా ? భారతదేశంలో కరోనా కేసులు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. ఫోర్త్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రోజురోజుకు కేసులు అధికం కావడమే ఇందుకు కారణం. అయితే.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రధానంగా ఏపీలో పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ కు పరిమితమవుతున్నాయి. మరణాలు కూడా సంభవించడం లేదు.

Read More : New Variant : ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం

దీంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు. ఏపీలో తాజాగా… 3 వేల 116 శాంపిల్స్ పరీక్షిస్తే.. కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 01 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,08,244 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు

జిల్లాల వారీగా కేసులు : అల్లూరి సీతరామరాజు 00, అనకాపల్లి 00, అనంతపురం 00, అన్నమయ్య 00, బాపట్ల 00, చిత్తూరు 00, ఈస్ట్ గోదావరి 00, ఏలూరు 00, గుంటూరు 00, కాకినాడ 00, కొనసీమ 00, కృష్ణా 00, కర్నూలు 00, నంద్యాల 00, ఎన్టీఆర్ జిల్లా 01, పల్నాడు 00, పార్వతీపురం మణ్యం 00, ప్రకాశం 00, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 00, శ్రీ సత్యసాయి 00, శ్రీకాకుళం 00, తిరుపతి 00, విశాఖపట్టణంలో 00, విజయనగరం 00, వెస్ట్ గోదావరి 00, వైఎస్సార్ జిల్లా 00. మొత్తం : 01

ట్రెండింగ్ వార్తలు