Covid-19 Precaution Dose: కోవిడ్-19 టీకాలపై వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు

కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గైడ్‌లెన్స్ ను విడుదల చేసింది. రెండో డోసు కొవిడ్‌ టీకా తీసుకుని 9 నెలలు లేదా 39వారాలు గడిచిన తర్వాతే ప్రికాషన్ డోస్

Covid-19 Precaution Dose: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గైడ్‌లెన్స్ ను విడుదల చేసింది. రెండో డోసు కొవిడ్‌ టీకా తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు గడిచిన తర్వాతే ప్రికాషన్ డోస్ స్వీకరించడానికి అర్హత వస్తుంది. రెండు డోసులు ఇప్పటికే స్వీకరించిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు దాటిన వారికి మూడో డోసును జనవరి 10 నుంచి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

రెండో డోసు స్వీకరించిన తేదీని కొవిన్‌ పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆ తేదీ నమోదై ఉంటే దాని ఆధారంగానే ముందుజాగ్రత్త డోసు స్వీకరించడానికి అర్హత లభిస్తుంది.

ఇటీవల ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రకంపనల నేపథ్యంలో ముందుజాగ్రత్త డోసు ఇవ్వాలని.. దీంతోపాటు 15-18 ఏళ్ల లోపు వారికి తొలిసారిగా టీకాను అందించేందుకు కేంద్రం అనుమతించింది. లేదా 15 ఏళ్లు పైబడిన వారే ఈ కేటగిరీలో అర్హులు.. 2007వ సంవత్సరం లేదా అంతకంటే ముందు పుట్టి ఉంటే జనవరి 3వ తేదీ నుంచి కొవిడ్ వ్యాక్సిన్ టీకా తీసుకోవచ్చు. అది కూడా కొవాగ్జిన్‌ టీకా మాత్రమే.

ఇది కూడా చదవండి : ఏపీ సినిమా టికెట్ల ధరలపై ఆర్జీవీ వ్యాఖ్యలు

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా వైద్యుడు సూచించిన చీటిని పొందుపర్చాల్సి ఉంటుంది. అర్హులైన అందరికీ ప్రభుత్వ వైద్యంలో ఉచితంగా టీకాలను అందజేస్తారు.

ట్రెండింగ్ వార్తలు