పోలవరంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు .. సెమినార్ లో వక్తలు

చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న ..

Chandrababu Naidu

White Paper on Polavaram : పోలవరం ప్రాజెక్టు అంశంపై సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సెమినార్ జరిగింది. ఈ సెమినార్ కి సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవలు, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు హాజరయ్యారు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్రస్తుత పరిస్థితులు, పునరావాసం, నష్టపరిహారం అంశాలు ఏమీలేవని సెమినార్ లో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత నిర్వాసితులకు ఇవ్వడం లేదు. నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : పూరీ శ్రీక్షేత్ర రత్నభండార్‌ తెరిచే కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..?

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ద నిర్వాసితుల గురించి శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు 70శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెపుతున్నారు. కానీ, పూర్తి అయింది 22శాతం మాత్రమే. ఇప్పటి వరదలకే భద్రాచలం వరకు గ్రామాలు ముంపుకు గురైయ్యాయి. కాంటూరు లెక్కలు పూర్తిగా తప్పుల తడక. తెలంగాణ నుండి మండలల్ని తెచ్చుకొన్నది ముంచడానికా అంటూ శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు అన్ని ఈ అంశంపై స్పందించాలని ఆయన కోరారు.

Also Read ; విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత.. ఎందుకంటే..?

సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. మేకల్ని బ్యాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు. గ్రీనరీ తగ్గడానికి మేకలే కారణం అనుకొన్న వ్యక్తి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై నాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆదివాసీల హిస్టరీకి హిస్టరీ ఉండదు. రాముడు పుట్టాడని అయోధ్యలో గుడి కట్టారు… మరి ఆదివాసీల దేవుళ్ళ పరిస్థితి ఏమిటి? శ్వేతపత్రంలో ఎందుకు గిరిజనుల గురించి లేదు? అంటూ ఉమామహేశ్వరి ప్రశ్నించారు. కట్టే ప్రాజెక్టు కేవలం ఐదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకోసం కట్టేది కాదు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రజలతోపాటు జీవజాతులు లేవు. శ్వేతపత్రంలో గోదావరినే మిస్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.