Cyclone Asani Continues : ఏపీపై అసని తుపాను ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

దక్షిణకోస్తాలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మధ్యస్ధంగా వర్షాలు కురవనున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని..

Cyclone Asani Continues : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. మచిలీపట్నంకి తూర్పు ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు, నర్సాపూర్ కి దక్షిణ నైరుతిగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను ప్రభావంతో ప్రస్తుతం గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో.. అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.

తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ సాయంత్రం వరకు నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరం మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని వెల్లడించారు. ఈరోజు, రేపు దక్షిణకోస్తాలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మధ్యస్ధంగా వర్షాలు కురవనున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

CM Jagan : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని తుపాన్ కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

రాగల 12 గంటల్లో తుపాను మరింత బలహీనపడి, వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఉదయం వరకు 40-60 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరంలో గాలులు వీస్తాయని వెల్లడించారు. మరికొద్ది గంటల్లో సముద్రంలోకి ప్రవేశించి క్రమేపీ బలహీనపడుతుందన్నారు. కాకినాడకు ఎగువన ఉన్న పోస్టులలో ఏడో నెంబరు ప్రమాద హెచ్చరిక, దిగువన ఉన్న పోస్టులలో ఐదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారి చేసినట్లు చెప్పారు. కాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత

అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్ గా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులు ఇచ్చామని తెలిపారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం అన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు