దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్..

  • Publish Date - September 30, 2020 / 10:35 AM IST

Daggubati Purandeswari: బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారినపడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


పురందేశ్వరి ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే పురందేశ్వరికి కరోనా సోకి ఉండవచ్చని సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


కాగా మంగళవారం(సెప్టెంబర్ 29) ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు.