Daggubati Venkateswara Rao
ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడు గ్రామస్తులతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాటామంతీలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోలేని సమయంలోనే దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీలో చేరారని గుర్తు చేశారు. తాను గత ఎన్నికల్లో పర్చూరులో వైసీపీ నుంచి పోటీ చేశానని గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు కారంచేడులో రోడ్లు వేయలేదని ప్రజలు అంటున్నారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగలేకపోయేవాడినని అన్నారు. దేవుడి దయవల్ల పర్చూరులో తాను ఓడిపోవడమే మంచిదైందని చెప్పారు.
KA Paul : పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్
ఎన్నికల తర్వాత జగన్ తనను పిలిచారని, తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు. ఆయన పెట్టిన నిబంధనలకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. నేడు రాజకీయాలంటే పరస్పరం తిట్టుకోవడం తప్ప, వాటి వల్ల ఒరిగేదేమీ ఉండడం లేదని అన్నారు.