KA Paul : పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్
ఏపీలో ఉన్న 175 మంది అభ్యర్థులు 100 కోట్లు, 50 కోట్లు మీరు చంద్రబాబుకి ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడిపోయేకంటే ఒక్క చాలెంజ్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఓడిపోలేదు. చంద్రబాబు 14ఏళ్లు ఏం చేశారు?

KA Paul Sensational Comments
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన, ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు క్రిస్మస్ సందర్భంగా బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు కేఏ పాల్. జనవరి 1లోపు తనతో కలిస్తే పవన్ కల్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాను అని కేఏ పాల్ చెప్పారు.
విశాఖలో తన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు కేఏ పాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తమ పార్టీ ప్రజా శాంతితో పొత్తు పెట్టుకోవాలని కోరారు . జనవరి 1వ తేదీలోగా తమతో పొత్తుకి పవన్ కల్యాణ్ వస్తే.. ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తానన్నారు కేఏ పాల్.
‘నా చేతులు ఎందుకు కట్టేశారు. నా డబ్బులు ఎందుకు సీజ్ చేశారు. నా పీస్ మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు. నేను ఫారిన్ మినిస్టర్ అయితేనే ఈ దేశంలో మోదీ చేసిన 138 లక్షల కోట్ల అప్పు, కాంగ్రెస్ చేసిన 50లక్షల కోట్ల అప్పు, చంద్రబాబు-జగన్ చేసిన 10లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ చేసిన 7లక్షల కోట్ల అప్పు తీర్చగలను. కేఏ పాల్ వస్తే మన దేశ ఎకానమీ బాగుంటుందని గద్దర్ అనేకసార్లు చెప్పారు. ఇక 3 నెలల టైం ఉంది ఎన్నికలకు.
Also Read : అవును అప్పులు చేయాల్సిందే..! సీఎం జగన్ సరికొత్త వ్యూహం, తొలిసారి టీడీపీ ఆరోపణలకు కౌంటర్
ఏపీలో ఉన్న 175 మంది అభ్యర్థులు 100 కోట్లు, 50 కోట్లు మీరు చంద్రబాబుకి ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడిపోయేకంటే ఒక్క చాలెంజ్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఓడిపోలేదు. చంద్రబాబు 14ఏళ్లు ఏం చేశారు? అవినీతి చేశారు. లక్షల కోట్లు అప్పు చేశారు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా? స్పెషల్ ప్యాకేజీ తెచ్చారా? పవన్ కల్యాణ్ ఆలోచించు.
చంద్రబాబు గూండాలను పంపి కొట్టిస్తాడట. ఆయన పేరు ఏదో తెలుగునాడు. కుర్రాడు. వయసు 26 సంవత్సరాలు ఉంటుంది. నేను అనుకుంటే నువ్వు గుండె ఆగి చస్తావ్. రాజశేఖర్ రెడ్డికి కే దిక్కు లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు. దైవశక్తి తెలుసా నీకు? నీ పేరు పెట్టి రాత్రి శపించాను అంటే నువ్వు మసైపోతావు.
కేసీఆర్ చిత్తు చిత్తుగా ఓడిపోతావ్ అన్నా ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకేజీ స్టార్ గా వద్దు ఓడిపోతావ్, పాలొల్లులో కూడా ఓడిపోతావు అన్నాను. ఓడిపోలేదా? షర్మిల ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని వందసార్లు అన్నా.. నిలబెట్టిందా?
Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్
పవన్ తమ్ముడూ నీకు మరోసారి ఆఫర్ ఇస్తున్నా. క్రిస్మస్ గిఫ్ట్ గా. వాళ్లు నీకు 24 సీట్లు ఇచ్చేది ఏంటి? 48 సీట్లు ఇస్తా రా. 12 సీట్లు సీపీఐ, సీపీఎంకు ఇస్తాం. మీరు 60 సీట్లు గెలవండి. మేము 115 సీట్లు గెలుస్తాం. అభివృద్ధి అంటే ఏంటో మీ ద్వారా చూపిద్దాం. జనవరి 1లోపు నువ్వు వస్తే నిన్నే నేను ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తా. చాలామంది నిన్ను వద్దంటున్నా.. నీకు ఒకటి రెండు శాతమే ఓటు బ్యాంకు ఉన్నా.. నిన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తాను. నేను ఎంపీగా గెలిచి సెంట్రల్ లో ఫారిన్ మినిస్టర్ అయ్యి ఎంపీగా ఫండింగ్ తీసుకొస్తాను” అని కేఏ పాల్ అన్నారు.